30 April, 2026 | 2:50 AM

టెన్త్ ఫలితాల్లో నారాయణదే హవా

30-04-2026 01:28 AM

హైదరాబాద్, ఏప్రిల్ 29(విజయక్రాంతి): తెలంగాణ ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో నారాయణ హవా కొనసాగింది. ఎప్పటిలాగే నారాయణ విద్యార్థులు తమ ప్రతిభతో పైచేయి సాధించారు. స్టేట్‌లోనే టాప్ మార్కులతో నారాయణ విద్యార్థి మేథాన్ష్ శ్రీరామ(హెచ్‌టీ నెం.26231094 45) 597 మార్కులతో చరిత సృష్టించాడు. అదేవిధంగా శోభిత కొప్పారపు(హెచ్‌టీ నెం.2621106169) 596  మార్కులు, మన్నే చంద్రహాస్(హెచ్‌టీ నెం262110619 3)596 మార్కులు, తూముల నిశ్చయ్ ప్రణవ్(హెచ్‌టీ నెం.2621106237) 596 మార్కులు, కిలారి లలిత్ (హెచ్‌టీ నెం.2623 109391) 596 వంటి టాప్ మార్కులతో సంపూర్ణ ఆధిపత్యం కొనసాగించారు.

అలాగే 595 మార్కులు 6గురు విద్యార్థులు, 594 మార్కులు 8 మంది విద్యార్థులు, 593 మార్కులు 8 మంది విద్యార్థులు, 592 మార్కులు 19 మంది విద్యార్థులు, 591 మార్కులు 30 మంది విద్యార్థులు, 590 మార్కులు 40 మంది విద్యార్థులు సాధించగా, 590 ఆపైన 116 మంది విద్యార్థులు సాధించారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ, నారాయణ విద్యా సంస్థల కోర్ కమిటీ సభ్యురాలు రమా నారాయణ తెలిపారు. మ్యాథ్స్ సబ్జెక్టులో ఏ గేడ్‌లు సాధించిన విద్యార్థులు 7334, సైన్స్‌లో 7558 మంది, సోషల్‌లో 8022 మంది,

ఇంగ్లీష్‌లో 7475, ఫస్ట్ లాంగ్వేజ్‌లో 6574, సెకండ్ లాంగ్వేజ్‌లో 7259 మొత్తంగా ‘ఏ’ గ్రేడ్‌లు 44222 మంది సాధించినట్లు తెలిపారు. నారాయణ మ్తొం విద్యార్థుల సగటు మార్పు 530.26 సగటు మార్కు ఉందన్నారు. తెలంగాణలో 530.26 సగటు మార్కు సాధించిన ఏకైక విద్యాసంస్థ నారాయణ మాత్రమే అని పేర్కొన్నారు. తెలంగా ణలో 8935 విద్యార్థుల్లో99.66% ఉత్తీర్ణతా శాతం సాధింపజేసిన ఘనత  ఒక్క నారాయణకే దక్కిందన్నారు. 80 బ్రాంచిలలో 100% పాస్ పర్సంటేజ్ సాధించినట్లు తెలిపారు. ఇంతటి అనితర సాధ్యమైన విజయా నికి కారణమైన  విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక, అధ్యాపకేతర బందాన్ని నారాయణ విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.పునీత్ ప్రత్యేకంగా అభినందించారు.