19 June, 2026 | 11:09 AM

Breaking News

ఫిన్లాండ్‌లో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్‌.. ఇంకా వీడని మిస్టరీ   •   అగ్రహారంలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య   •   పేరుకే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం   •   సింగరేణిలో ఐదో రోజు కవిత బాయిబాట కార్యక్రమం   •   నల్గొండలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి   •   పుడమి తల్లి గర్భంలోనే పాడై పోతున్న అంకురం   •   దమ్ముంటే కేసీఆర్‌ ను టచ్ చేసి చూడు..!   •   నియోజకవర్గ రిపోర్టర్లకు జిల్లా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి   •   అక్రమ మొరం తవ్వకాలపై పోలీసుల దాడి.. ట్రాక్టర్, జేసీబీ స్వాధీనం   •   మధిరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బీఎల్ఓ లకు శిక్షణ   •  

నానో డీఏపీతో రైతులకు మేలు

19-06-2026 12:00 AM

వ్యవసాయ శాస్త్రవేత్త సాయి పల్లవి 

కొమురవెల్లి, జూన్ 18: నానో డిఏపీతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గి, పంట దిగుబడి పెరుగుతుందని తోర్నాల వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త సాయి పల్లవి సూచించారు. మండల కేంద్రంలోగల రైతు వేదికలో నానో డి ఏ పీ వాడకంపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకంపై రైతుల ఆలోచన విధానం మారాలని అధికంగా రసాయన ఎరువులు వాడితే ఎక్కువ దిగుబడి వస్తుందని ఆ లోచించడం మానుకోవాలన్నారు. జీవ రసాయన ఎరువులు వాడడం వల్ల భూసారం పెరగడంతో పాటు నాణ్యమైన పంటలు పం డుతాయి అన్నారు. జీవ రసాయన ఎరువు ల వల్ల భూమిలో ఉన్న బాస్వరాన్ని తగ్గించవచ్చు అని అన్నారు. పంటలు వేసేముందు జీలుగా, జనుము లాంటి పంటలువేసి వాటిని భూమిలోనే కలియదున్నాలన్నారు.

కొమురవెల్లి, చేర్యాల,మద్దూరు మండలాలలోని రైతులు అధికంగా భాస్వరాన్ని వాడడం వల్ల భూమిలో బాస్వరం నిల్వలు పెరిగాయని తమ పరిశోధనలు తేలిందని, దానికి పరిష్కారం నానో డి ఎ పి వాడడం వల్ల కొంతమేరకు తగ్గించవచ్చు అన్నారు. అనంతరం ఏ డి ఏ రాధిక మాట్లాడుతూ నానో డిఏపి  పురుగుల మందుతో కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు అని తెలిపారు. నానో డిఏపి పై కొన్ని సంవత్సరాలు పరిశోధన జరిగాయని, పరిశోధనలో ఫలితాలు బాగున్నాయి కాబట్టే, రైతులకు వాడుకోవాలని సూచించడం జరుగుతుందన్నారు. మొక్కజొన్న, వరి పంటలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం లో ఏవో వెంకట్రావమ్మ  కోర మండల్ కంపెనీ ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.