calender_icon.png 10 February, 2026 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సి "పోల్" పకడ్బందీగా నిర్వహించాలి

10-02-2026 04:43:43 PM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్

తాండూరు,(విజయక్రాంతి): రేపు బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎన్నికల్లో ఎలాంటి తప్పులు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం ఆయన వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సందర్శించి ఎన్నికలకు కావలసిన మెటీరియల్ పంపిణి కార్యక్రమాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

36 వార్డులకు గాను 117 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారి గా వేరు చేసి సిద్ధంగా ఉంచాలని...బ్యాలెట్ పత్రాలు, బాక్స్ లు జాగ్రత్త గా చెక్ చేసి ప్యాక్ చేసి ఎక్కడ కూడా డబల్ ఓటింగ్ జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏ ర్పాట్లు చేయాలని, వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కల్పించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు.

పోలింగ్ బూత్ లో ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని పోలింగ్ కేంద్రం వద్ద త్రాగునీరు, లైటింగ్, పా ర్కింగ్ ప్రదేశాలు, వచ్చిపోయేదారులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రూట్ల వారీగా బస్సు లు బయలుదేరే  విధంగా అధికారులు  దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. . ఇంకా ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ మంగీ లాల్,మున్సిపల్ కమిషనర్  మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ తారసింగ్,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.