calender_icon.png 23 February, 2026 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుధ్య పనులను పరిశీలించిన చైర్మన్

23-02-2026 03:43:30 PM

లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో సోమవారం పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్మన్ దొంతు అంజలి నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకట్ స్వామి గౌడ్ లు తిరిగి పరిశీలించారు. వార్డులోని పారిశుధ్య పనులను, చెత్తా చెదారం, పిచ్చి మొక్కలు, నాలీల క్లీనింగ్, మంచినీటి సమస్యలు లేకుండా చూస్తామని, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచనలతో వార్డు సుందరీకరణ అవసరమైన పనులను చేపడుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ, వార్డు అధ్యక్షుడు సయ్యద్ హాజీ, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ హఫీజ్, చిన్న రమేష్ నాయకులు పాల్గొన్నారు.