9 May, 2026 | 2:19 PM

Breaking News

ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000 సాయం   •   మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •  

కులం కాదు.. గుణం ముఖ్యం

31-01-2026 01:34 AM

సినిమా రివ్యూ

దేవగుడి 

తారాగణం: అభినవ్ శౌర్య, అనుశ్రీ, నరసింహ తోషి, రఘు కుంచె, రాజశ్రీ నాయర్, రఘుబాబు, లక్ష్మణ్ మీసాల, రాకెట్ రాఘవ, అన్నపూర్ణ, జబర్దస్త్ ఇమ్మాన్యూయెల్ తదితరులు

ఛాయాగ్రహణం: లక్ష్మీకాంత్ కనికె

సంగీతం: మదీన్ ఎస్‌కే

ఎడిటింగ్: వీ నాగిరెడ్డి 

కథరచన, దర్శకత్వం, నిర్మాత: 

బెల్లం రామకృష్ణారెడ్డి

విడుదల: 30 జనవరి, 2026

బెల్లం రామకృష్ణా రెడ్డి స్వీయ రచనాదర్శకత్వంలో నిర్మాతగానూ వ్యవహరి స్తూ రూపొందించిన తాజాచిత్రం ‘దేవగుడి’. యాక్షన్ అడ్వెంచర్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా శుక్రవారం (జనవరి 30) విడుదలైంది.  

ఇదీ కథ: రాయలసీమ ప్రాంతంలోని దేవగుడి అనే గ్రామానికి వీరరాఘవరెడ్డి (రఘు కుంచె) ఒక ఫ్యాక్షన్ లీడర్. ఆ ప్రాంతంలో వీరారెడ్డిగా పేరున్న వీరరాఘవరెడ్డి పట్ల దేవగుడి ప్రజలంతా భయభక్తులతో మసులుకుంటారు. వీరారెడ్డికి కొడుకు రాఘవరెడ్డి (నరసింహ), కూతురు శ్వేత (అనుశ్రీ) ఇద్దరు సంతా నం. వీరారెడ్డి అనుచరుల్లో ఒకరి కొడుకైన ధర్మ (అభినవ్‌శౌర్య).. ఆయన ఇద్దరు పిల్లలతోపాటే పెరుగుతాడు. ధర్మా.. తన కుమారుడి స్నేహాన్ని సహించడు. అయితే, కొడుకు రాఘవరెడ్డే ధర్మాను విడిచి ఉండలేకపోతున్నాడని తెలుసుకొని అయిష్టం గానే వారి స్నేహాన్ని అంగీకరిస్తాడు. ఓ రోజు ధర్మా, శ్వేత ఒకే గదిలో కలిసి ఉండటాన్ని  చూసిన రాఘవరెడ్డి వారి ప్రేమ వ్యవహారం గురించి తండ్రి వీరారెడ్డికి చెప్తాడు.

తండ్రీకొడుకులిద్దరూ ధర్మాను ఊరి నుంచి గెంటేస్తారు. తర్వాత శ్వేత ఇంట్లో నుంచి మిస్ అవుతుంది.. వీరారెడ్డి అనుచరుల్లో ఇద్దరు హత్యకు గురవుతారు. ఇంతకీ శ్వేత ఏమైంది? వీరారెడ్డి అనుచరులను చంపిందెవరు? శ్వేతను ధర్మ నిజంగానే ఇష్టపడ్డాడా? శ్వేత ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది? నమ్మక ద్రోహం చేసిన స్నేహితుడు ధర్మాను, తన చెల్లిని రాఘవరెడ్డి ఎందుకు కలపాలనుకున్నాడు? సామాజిక అంతరాల దృష్ట్యా మొదట్నుంచీ చిన్నచూపు చూసిన ధర్మాను అంగీకరించేలా వీరారెడ్డి మారిపోయేలా చేసిన పరిస్థితులేంటి? అనేదే సినిమా. 

విశ్లేషణ: కుల వ్యవస్థపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. కులం చుట్టూ తిరిగే అలాంటి కథతోనే సామాజిక అసమానతలను ప్రశ్నిస్తూ, కులం కాదు చూడాల్సింది.. గుణం అని చెప్పే ప్రయత్నం గొప్పగా, సరికొత్తగా ఉందనడంలో సందేహం లేదు. రెగ్యులర్ తెలుగు సినిమాల టెంప్లేట్‌లోనే ఈ సినిమా కథ కూడా సాగుతుంది. సన్నివేశాలన్నీ ఊహకు అందేట్టుగా సాగినా సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది. ఉన్న బడ్జెట్‌లో రిచ్ విజువల్స్‌తో మంచి పాటలు, ఫైట్స్, లవ్‌ట్రాక్‌లో రొమాన్స్ వంటి అన్ని అంశాలతో రూపొందించటంతో ప్రేక్షకులకు కమర్షియల్ సినిమా ఫీల్ కలుగుతుంది. 90లలో రాయలసీమ నేపథ్యం, ఫ్యాక్షనిజాన్ని ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఈ సినిమా చూస్తే మరోమారు ఆ రోజుల్లోకి వెళ్తారు.

నాయకానాయికల జోడీ ఆకర్షణీయంగా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. హీరో అభినవ్ శౌర్య, హీరోయిన్ అనుశ్రీ నటనతో అలరించారు. హీరోయిన్ సోదరుడి పాత్రలో నరసింహ సైతం ఆకట్టుకున్నారు. ఇక సంగీత దర్శకుడిగా, గాయకుడిగా సంగీతప్రియుల మనసు దోచుకున్న రఘు కుంచె.. ఇకపై దేవగుడి వీరారెడ్డిగా సినీప్రియులకు గుర్తుండిపోతారంటే అతిశయోక్తి కాదు. మీసాల లక్ష్మణ్, రఘుబాబు, రాకెట్ రాఘవ వంటి మిగతా తారాగణం తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక అంశాల విషయానికొస్తే.. మదీన్ సంగీతం ఆకట్టుకుంది. నేపథ్య సంగీతం ప్లస్ అయింది. ప్రముఖ గాయని చిత్ర స్వరంలో ప్రాణం పోసుకున్న పాటలు మెప్పిస్తాయి. కెమెరా వర్క్ బాగుంది.