13 March, 2026 | 5:40 PM

ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలి

13-03-2026 05:06 PM

- జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడ,(విజయక్రాంతి): ఈనెల 16వ తేదీ నుండి జరగనున్న బడ్జెట్ సమావేశాలో   రాష్ట్ర  ప్రజలకు  ఉపయోగపడే విధంగా నిధులు కేటాయించాలని  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో  ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరిచే విధంగా చూడాలన్నారు.

ఎన్నికల ముందు ప్రభుత్వం ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పిన వాటిలో ప్రస్తుతానికి మూడు మాత్రమే అమల్లో ఉన్నాయని, మిగిలినవి తక్షణమే అమలు చేయాలన్నారు.   రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నారు. 

 ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలి

 ప్రజల ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలపై నిరంతరం పనిచేయాలని సిపిఎం కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం నాడు స్థానిక సిపిఎం కార్యాలయంలో డివిజన్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలపై నమ్మకంగా పనిచేస్తున్నాడే ప్రజాదరణ ఉంటుందని వాటిని సాధించినాడే ప్రజలు ఆకర్షితులు అవుతారని తెలిపారు. 

కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలన్నారు.  పై సమస్యల సాధనకు  ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్ర పార్టీ ఇచ్చిన కర్తవ్యాలను పూర్తి చేయాలని వారు తెలిపారు. ఈ సమావేశాలలో సిపిఎం రాష్ట్ర సభ్యులు మల్లేష్ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు జిల్లా కమిటీ సభ్యులు శశిధర్ రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, రవి నాయక్ పరుశురాములు వినోద్ నాయక్ పాల్గొన్నారు.