14 March, 2026 | 2:28 PM

గార్గేయపురంలో విషాదం.. ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తల్లి

14-03-2026 11:43 AM

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా(Kurnool District) సమీపంలోని గార్గేయపురంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దురు పిల్లలతో పాటు తల్లి చెరువులో దూకింది. గమనించిన స్థానికులు మూడు మృతదేహాలను వెలికితీశారు. మృతులను తల్లి రాజేశ్వరి(35), కుమారులు అబ్రహం(03), సుకుమార్ (6)గా గుర్తించారు. రాజేశ్వరి కుటుంబకలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.