13 May, 2026 | 12:52 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

మూకీ చిత్రం టీజర్ రిలీజ్

17-01-2026 04:21 AM

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితిరావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూకీ సినిమా ‘గాంధీ టాక్స్’. ఈ చిత్రానికి కిశోర్ పాండురంగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఓ టీజర్‌ను విడుదల చేసిన టీమ్.. తాజాగా మరో టీజర్‌ను పంచుకుంది. విజయ్ సేతుపతి బర్త్‌డేను పురస్కరించుకొని రిలీజ్ చేసిన ఈ రెండో టీజర్ ఆకట్టుకుంటోంది. మాటలు, పాటలు లేకుండా రూపొందే మూకీ సినిమా అనగానే అందరికీ గుర్తుకొచ్చేది కమల్‌హాసన్ ‘పుష్పక విమానం’. అప్పట్లో ఈ మూవీ ఓ సంచలనం. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వస్తున్న ఈ మూకీ చిత్రంపై అంతటా ఆసక్తి నెలకొంది. ఈ నెల 30న ఈ సినిమా విడుదల కానుంది.