ఏపీ మద్యం కుంభకోణం.. కీలక సూత్రధారి రాజ్ కెసిరెడ్డి అరెస్ట్
ఏపీ మద్యం కుంభకోణం
తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
హైదరాబాద్: ఏపీ మద్యం స్కామ్(AP Liquor Scam Probe) లో కీలక సూత్రధారి రాజ్ కెసిరెడ్డిని ఈడీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణానికి సంబంధించి, రెండు తెలుగు రాష్ట్రాల్లోని 10కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సోదాలు నిర్వహిస్తోంది. గురువారం ఉదయం నుండి హైదరాబాద్‌లోని అర డజను ప్రాంతాల్లో ఈడీ (ED) అధికారులు సోదాలు చేస్తున్నారు. లిక్కర్ కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన రాజ్ కెసిరెడ్డి, ఇందులో ప్రమేయం ఉన్న ఇతరుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఏపీ మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయల చేతులు మారాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు బదిలీ అయినట్లు ఈడీ (ED) గుర్తించింది.






