7 April, 2026 | 3:20 PM

Breaking News

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కోవ లక్ష్మి   •   ప్రజలు మధ్యవర్తులను నమ్మవద్దు   •   కన్నాలలో బాలామృతం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గుడిసె గట్టయ్య   •   కేంద్రం కీలక నిర్ణయం.. 5 కిలోల గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు   •   నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా— ఇద్దరు మృతి   •   హైదరాబాద్‌లో కలకలం... కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు   •   పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులే రాజులు   •   ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలి   •   మల ద్వారంలో పెట్టిన పైపు.. మృతి చెందిన యువకుడు!   •  

మోదీ కాల్ చేయలేదు!

10-01-2026 01:48 AM
  1. అందుకే వాణిజ్య ఒప్పందం నిలిచింది..
  2. అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్: భారత్ -అమెరికా మధ్య జరగాల్సిన కీలక వాణిజ్య ఒప్పందాలు భారత ప్రధాని నరేంద్ర మోదీ కాల్ చేయకపోవడం వల్లనే నిలిచిపోయాయని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ తాజాగా ఆరోపణలు చేశారు.

మోదీ స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు కాల్ చేయాల్సి ఉందని, కానీ.. భారత ప్రధాని మోదీ పని చేయలేదని పేర్కొన్నారు. తమ దేశం విధించిన గడువు లోపు భారత ప్రధాని స్పందించకపోవడం వల్లే వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు రేసులో ముందుకు వెళ్లాయని పేర్కొన్నారు. భారత ఉత్పత్తులపై గతేడాది తమ దేశం 50 శాతం సుంకం విధించడానికి ఈ ఫోన్ కాల్ వ్యవహారమే ప్రధాన కారణమని తేల్చిచెప్పారు.