ఫోన్లో మోదీ, విజయ్ సంభాషణ
11-05-2026 03:19 AM
- విజయ్‌కి మోదీ శుభాకాంక్షలు
- తమిళనాడుకు కేంద్రం పూర్తి సహకారం
చెన్నై, మే 10: ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ ఫోన్లో ఆదివారం మాట్లాడుకున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌ని మోదీ అభినందించారు. అంతకుముందు తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో విజయ్ పాలన అద్భుతంగా సాగాలని ప్రధాని ఆకాంక్షించారు.






