13 May, 2026 | 3:00 AM

మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఫలితాలు విడుదల

13-05-2025 10:20 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): 2025 విద్యాసంవత్సరానికి 6 తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 46.86 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 6వ తరగతిలో 18,501 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే అందులో 9,603 మంది ఉత్తీర్ణత సాధించారు. 7వ తరగతిలో 5249 మందికిగానూ 2,214,, 8వ తరగతిలో 4,011 మందిలో 1,448 మంది, 9వ తరగతిలో 2,521 మందిలో 916 మంది, 10వ తరగతిలో 602 మందికిగానూ 215 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. అడ్మిషన్ టెస్టును ఏప్రిల్ 27న నిర్వహించిన విషయం తెలిసిందే.