22 August, 2026 | 11:27 PM

ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

22-08-2026 10:33 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ లోని కళాభారతి లో  నటుడు చిరంజీవి  71వ జన్మదిన సందర్భంగా నగరంలో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల కళాకారులకు బహుమతులను ప్రధానం చేసిన అనంతరం మాట్లాడుతూ తన జీవితంలో మొదటిసారి ఒక నటుడి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం, అదీ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

నటనపై ఆసక్తి ఉన్న ఉత్సాహవంతమైన యువతకు ప్రోత్సాహాన్ని అందిస్తూ, ఈ రకమైన మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 70 ఏళ్ల వయస్సు దాటినా కూడా ఎంతో ఉత్సాహంతో, యువకుడిలా గొప్ప చిత్రాలు తీస్తూ ప్రజల మనస్సులను గెలుచుకుంటున్నారు.  రాబోయే రోజుల్లో చిరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు సొల్లు  అజయ్ వర్మ, మిలీనియం శ్రీనివాస్, మిడిదొడ్డి కపిల్ మాధవ్ పాల్గొన్నారు.