16-02-2026 10:00:58 AM
మహబూబ్ నగర్ (విజయ క్రాంతి): పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై క్షణక్షణం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 60 డివిజన్లు గాను మేజిక్ ఫిగర్ 31 ఉండగా తాజాగా ఎక్స్ అఫీషియో కింద ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కు నమోదు చేసుకోవడంతో ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 32 కు చేరింది. ఎక్స్ అఫిషియో కింద ఎంపీ డీకే అరుణ తమ ఓటు హక్కును నమోదు చేసుకుంటారని అందరు భావించగా అందుకు విరుద్ధంగా ఓటు హక్కును నమోదు చేసుకోకుండా దూరంగా ఉన్నారు. దీంతో ఎక్స్ అఫిషియో కింద ఎమ్మెల్యే ఒక్కరే ఓటరుగా నమోదు చేసుకున్నారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ 32 దక్కించుకున్న వారే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటారు.
ఇందుకు కాంగ్రెస్ పూర్తిస్థాయి మ్యాజిక్ ఫిగర్ ని దక్కించుకొని మేయర్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తుంది ఇక మేయర్ అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠ గా నెలకొనగా తాజాగా అభ్యర్థి పేరును సీఎం ఆఫీస్ నుండి షీల్డ్ కవర్లో వస్తుందని ప్రకటించేశారు. దీంతో మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా రెట్టింపు స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. సోమవారం మధ్యాహ్నం లోగా పాలమూరు మేయర్ అభ్యర్థి ఎవరనేది తేలిపోనుంది. డిప్యూటీ మేయర్ కు సైతం ఇదే స్థాయి పోటీ నెలకొనడంతో అభ్యర్థిని ప్రకటించలేక ఎమ్మెల్యేతో పాటు అధికార పార్టీ నేతలు కొంత ఈభంది ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. మేయరు డిప్యూటీ మేయర్ ఎవరనేది? నేడు మధ్యాహ్నం లోగా బయటపడనుంది.
మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అరెస్ట్?
పాలమూరు కార్పొరేషన్ ఎన్నిక ప్రక్రియకు తొలి సమయానికి చేరుకోవడంతో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ అరెస్టు చేశారని తెలుస్తుంది. మేయర్ బరిలో ప్రసన్న ఆనంద్ గౌడ్ తో పాటు పలువురి ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఇలాంటి ఇబ్బందులు లేకుండా గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా ఉండేందుకు హైదరాబాదులోనే మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. అభ్యర్థుల ఫలితాలు వెలువడిన వెంటనే పక్క రాష్ట్రంలో రెండు రోజులు ఉండి రాత్రి హైదరాబాద్ కు ఓ రిసార్ట్లో ఉండి పూర్తి మంతనాల అనంతరం మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.