పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఎమ్మెల్యే
09-06-2026 06:38 PM
ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మంగళవారం ఉట్నూర్ లో అటవీ శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి నీ కాపాడడం ప్రజలందరి బాధ్యత అని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి చెట్లను పెంచడం వల్ల ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు అవుతారని. కర్ణాటక లోని బందిపూర్ టైగర్ రిజర్వ్ తరహా వన్య ప్రాణులను పెంచాలని అన్నారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రకృతిని రక్షిద్దాం అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.






