21 July, 2026 | 10:32 PM

Breaking News

100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

20-07-2026 01:55 AM

కోదాడ, జూలై 19 :కోదాడ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ఆదివారం పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్ను కోరారు. నాణ్యతలో రాజీ పడొద్దన్నారు. అనంతరం 30 పడకల ఆస్పత్రిలో రికార్డులను పరిశీలించారు. రోగులను వైద్యం సరిగా అందుతుందా లేదా వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిండెంట్ దశరధ, సిబ్బంది, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.