తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
16-05-2026 06:41 PM
జమ్మికుంట,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలుసుకున్నారు. శనివారం మంత్రిని కలుసుకున్న ఎమ్మెల్యే శంకరపట్నం మండలం కల్వల గ్రామంలోని కల్వల ప్రాజెక్ట్ మరమ్మత్తులు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాజెక్టు మరమ్మత్తుతో శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట మండలాల చెందిన రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడి, సుమారు 8000 ఎకరాలకు సాగునీరు అందించవలసిన, ప్రాజెక్ట్ మరమతుకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు ఆయనకు తెలిపారు.






