14 May, 2026 | 12:19 AM

Breaking News

అభివృద్ధిలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు

23-12-2025 05:41 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధిలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని డివిజన్లో అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టి శంకుస్థాపన చేసిన అనతికాలంలోనే పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంగళవారం 59వ డివిజన్ పరిధిలోని కనకదుర్గ కాలనీలో రూ.74.10 లక్షలతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు, సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపడేలా ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులు అమలు చేస్తున్నామని, ప్రతి డివిజన్లో అవసరమైన పనులను గుర్తించి వేగవంతంగా పూర్తి చేస్తున్నామని అన్నారు. నాణ్యతలో ఎక్కడ రాజీ లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.