14 July, 2026 | 2:23 PM

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.... ప్రభుత్వ గిరిజన పాఠశాల

14-07-2026 02:13 PM

యూనిఫామ్ డ్రెస్సులు చూస్తే  ప్రైవేట్ పాఠశాల అనుకుంటే పొరపాటే..

ఇతర మండలాల నుండి విద్యార్థులు..

ఉట్నూర్, జులై 14 (విజయక్రాంతి): ప్రైవేట్ పాఠశాల కు దీటుగా... ఐటీడీఏ ఆధ్వర్యంలోని  (గిరిజన విద్యా వికాస కేంద్రం ) టీ డబ్ల్యూ పాఠశాల  పనిచేస్తున్నది. ఇంద్రవెల్లి మండలంలోని  చిత్రుగూడా లోని  గిరిజన పాఠశాలలో  ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు  34 మంది విద్యార్థులకు ఇద్దరు ఆంగ్లంలో విద్యాబోధన చేస్తున్నారు. గిరిజన పాఠశాలలో  విద్యార్థులకు చక్కటి ఇంగ్లీష్ విద్యను అందిస్తున్న ఉపాధ్యాయుల  పనితీరును  గ్రామస్తులు గుర్తించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా  యూనిఫామ్ డ్రెస్ తో పాటు  ప్రతి విద్యార్థులకు టైలు  గ్రామస్తులు ఏర్పాటు చేశారు.

గ్రామం నుండి కొమరం భీం జిల్లా లింగాపూర్ మండలంలోని చొర్గావ్ గ్రామంలోని  విద్యార్థులతో పాటు  నార్నూర్, గాదిగూడ మండలాలలోని మారుమూల గ్రామాల నుండి ఆదివాసి గిరిజన పిల్లలను బంధువుల ఇంటిలో పిల్లలని ఉంచి  గిరిజన పాఠశాలలో చదివిస్తున్నారు. గత ఏడాది 22 మంది  విద్యార్థులు విద్యను అభ్యసించగా  ఈ ఏడాది విద్యా సంవత్సరంలో  34 మంది విద్యార్థులతో పాఠశాలను నడిపిస్తున్నారు. ఈ పాఠశాలలో చక్కని క్రమశిక్షణతో పాటు విద్యా బోధన జరగడంతో  గ్రామస్తులు సైతం  ఉపాధ్యాయులను ప్రోత్సహించే విధంగా  అన్ని విధాల  సహకరిస్తున్నారు. ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకొని  మిగతా ఆదివాసీ గిరిజన గుడాల ప్రజలు  తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి  చదువులు నేర్పించే విధంగా ప్రతి ఆదివాసి గూడెం  గిరిజనులు తమ పిల్లలను చదివించాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నట్లు  గ్రామస్తులు తెలిపారు.