8 June, 2026 | 2:57 AM

బొడ్రాయి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

08-06-2026 12:00 AM

ఘట్ కేసర్, జూన్ 7 (విజయకాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, అదిలాబాద్ డివిజన్ పరిధిలోని అవుషాపూర్ లో ఆదివారం జరిగిన బొడ్రాయి పండగ 2వ వార్షికోత్సవంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వెంటరాగ నైవేద్యంతో కూడిన బోనాలతో బొడ్రాయి వద్దకు చేరుకొని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ఈకార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి మంద సంజీవరెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ డొంకెని బిక్షపతి గౌడ్, మాజీ ఉప సర్పంచ్ ఎలసాని ఐలయ్య యాదవ్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మామిండ్ల ముత్యాల్ యాదవ్, నాయకులు పన్నాల కొండల్ రెడ్డి, నాగులపల్లి రమేష్, బద్దం జగన్మోహన్ రెడ్డి, కవాడి మాధవరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, మేడ బోయిన జంగయ్య ముదిరాజ్, కందకట్ల సందీప్ రెడ్డి, ఎరుకల దుర్గరాజు గౌడ్, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.