13 August, 2026 | 9:19 PM

ఎల్ఓసి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

13-08-2026 07:46 PM

నిర్మల్,(విజయక్రాంతి): సారంగాపూర్ మండలం బీరవెల్లి  గ్రామానికి  చెందిన తాళ్ళ ఆయాంశిక కుటుంబానికి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎల్ఓసీ చెక్కులు అందించారు. అనారోగ్య కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స నిమిత్తం రూ.65 వేల ఎల్ఓసీ చెక్కును సదరు కుటుంబ అందించారు. ఈ సందర్భంగా ఆపదలో ఉన్న తమ కుటుంబానికి  అండగా ఉన్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బ్యాగరి ఎల్లన్న, ఉప సర్పంచ్ ప్రశాంత్, బీజేపీ నాయకులు నిమ్మల శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.