13 August, 2026 | 10:11 PM

మార్పు కోసమే ఈ చైతన్య యాత్రలు

13-08-2026 09:13 PM

158 బహిరంగ సభలు దిగ్విజయంగా పూర్తి

460 గ్రామాలు, బస్తీల మీదుగా కొనసాగిన  యాత్ర

కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొడతాం

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): సిపిఐ జాతీయ కమిటీ పిలుపుమేరకు ‘బద్లావ్ జరూరీ హై’ నినాదంతో ఆగష్టు 6 నుంచి వారం రోజులపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం నుంచి అశ్వారావుపేట వరకు చేపట్టిన జన చైతన్య యాత్రలు జిల్లా వ్యాప్తంగా అత్యంత విజయవంతమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తెలిపారు. గురువారం శేషగిరిభవన్'లో  అయన మాట్లాడుతూ... జిల్లాలోని 23 మండలాల పరిధిలో ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఈ ప్రచార యాత్రలు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగాయని పేర్కొన్నారు.

ఈ యాత్రల్లో భాగంగా వివిధ గ్రామాలు, మండల కేంద్రాలలో మొత్తం 158 బహిరంగ సభలను నిర్వహించామని, 460 గ్రామాలు,బస్తీల మీదుగా పాదయాత్రలు, ప్రచార కార్యక్రమాలు కొనసాగాయని వెల్లడించారు. వందమంది పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు యాత్ర బృందంగా పాల్గొని జయప్రదం చేశారని తెలిపారు. ఈ యాత్రల ద్వారా సుమారు మూడు లక్షల మంది ప్రజలను నేరుగా కలసి యాత్ర ముఖ్య ఉద్దేశాలను, ప్రజా సమస్యలపై పార్టీ పోరాట పంథాను వివరించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. యాత్రల స్పూర్తితో సెప్టెంబర్ 1న ఢిల్లీ రాం లీలా మైదానంలో జరిగే జాతీయ స్థాయి ధర్నా, బహిరంగ సభకు తరులుతామని స్పష్టం చేశారు.