గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు తంత్రి గణేష్
ఎల్లారెడ్డి, ఆగస్టు 30 (విజయ క్రాంతి):ఎల్లారెడ్డి,నియోజకవర్గంలోని లింగంపేట మండలంలోని మెంగారం గ్రామంలో మృతి చెందిన గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. పార్టీ నాయకుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ మేంగారం గ్రామంలోని గణేష్ స్వగృహానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారి బాధలో పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
గణేష్ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, గణేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






