20 July, 2026 | 6:43 PM

Breaking News

పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

20-07-2026 01:10 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జులై 19(విజయక్రాంతి): ఆషాఢ మాసం సందర్భంగా జిల్లా కేంద్రంలోని దస్నాపూర్లో కొలువైన పోచమ్మ తల్లిని ఆదివారం ఎమ్మెల్యే కోవ లక్ష్మీ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్ర మంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

దారి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు...

ఆసిఫాబాద్ మండలంలోని బురుగూడ శివారులో ఉన్న దారి మైసమ్మ ఆలయంలో ఆదివారం వాహన యజమానులు, డ్రైవర్లు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించి వాహనాలు సురక్షితంగా నడవాలని, ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ప్రార్థించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాహన యజమానులు, డ్రైవర్లు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.