16 August, 2026 | 4:49 PM

తెలంగాణ SAFE కమిషనర్‌గా అవినాష్ మొహంతి నియామకం

16-08-2026 03:11 PM

హైదరాబాద్: ఆహార భద్రత విభాగం మరియు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌ను విలీనం చేసి ఏర్పాటు చేసిన TG SAFE (Telangana Standards Authority for Food and Essential Drugs) కు కమిషనర్‌గా అవినాష్ మొహంతి, ఐపీఎస్ (2005 బ్యాచ్) నియమితులయ్యారు. ప్రస్తుతం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్న అవినాష్ మొహంతికి, ఆయన సాధారణ విధులకు అదనంగా TG SAFE కమిషనర్ బాధ్యతలను అప్పగించారు.  ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలపై సమగ్ర పరిపాలనా నియంత్రణతో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఈ కొత్త వ్యవస్థను రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం 06-08-2026న జారీ చేసిన http://G.O.Rt.No.1135 ద్వారా నియామక ఉత్తర్వులు వెలువరించింది.