1 July, 2026 | 6:39 PM

Breaking News

బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •  

ఫలించిన ఎమ్మెల్యే కూనంనేని కృషి

15-04-2026 12:26 AM

నియోజకవర్గానికి రెండు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మంజూరు

కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): నియోజకవర్గ పరిధిలోని మొక్కజొన్న రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన కృషి ఫలించింది. లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి పరిసర ప్రాంతాలతో పాటు పాల్వంచ పరిసర గ్రామాల రైతులకు అందుబాటులో ఉండేలా కొత్తగూడెం నియోజకవర్గానికి రెండు కొత్త మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంజూరు చేసింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించి కేంద్రాలను కేటాయించిందని తెలిపారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంట కోత దశకు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరితగతిన కేంద్రాలను ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేసేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. మంజూరైన ఈ కేంద్రాల పట్ల నియోజకవర్గ రైతాంగం, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.