అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే
కోదాడ మే 11: కోదాడ మండలం, కాపుగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో రూ 33లక్షలతో నిర్మించిన సైన్స్ ల్యాబ్ & లైబ్రరీ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోవిద్యా వారోత్సవాల్లో భాగంగా రూ 40.50 లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు.
కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో రెవిన్యూ, హౌసింగ్, మున్సిపల్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో నియోజక వర్గ పరిధిలోని 86 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ & షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ తొండపు సతీష్, సర్పంచ్ అప్పారావు, ముత్తవరపు పాండురంగారావు, నంబూరి సూర్యం, హెచ్‌ఎం వస్కుల రామారావు, నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






