దివ్యాంగుడికి స్కూటీ అందజేసిన ఎమ్మెల్యే
18-05-2026 01:55 AM
మనకొండూర్, మం17(విజయక్రాంతి):తిమ్మాపూర్ మండలం ఎల్.ఎం.డి కాలనీలోని ప్రజా భవన్ లో ఆదివారం గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు సతీష్ రెడ్డి ప్రభుత్వం తరపున స్కూటీ ని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ అందజేశారు.ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, బెజ్జంకి మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, పార్టీ నాయకులు అంజిరెడ్డి, ఎర్రోళ్ల రాజయ్య, ఎల్లారెడ్డి, చింతలపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు.






