11 March, 2026 | 3:10 PM

Breaking News

ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు   •   కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •  

అన్నారం ప్రభుత్వ భూమిని కాపాడుకుందాం

11-03-2026 12:39 AM

రియల్ ఎస్టేట్ ఏజెంటుగా టీజీఐఐసీ సంస్థ

ప్రభుత్వంపై ఎమ్మెల్యే జీఎంఆర్ ఆగ్రహం

గుమ్మడిదల, మార్చి 10: గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం సర్వే నం బర్ 261 ప్రభుత్వ భూమిని కాపాడుకుందామని, రాష్ట్ర ప్రభుత్వ టీజీఐఐసీ సంస్థ రియ ల్ ఎస్టేట్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గు మ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం 261 ప్రభుత్వ భూమిలో ప్రత్యక్షంగా బాధిత రైతులతో కలిసి పరిశీలించి రైతులకు సమన్యాయం జరిగేంతవరకు అవసరమైతే ఆమ రణ నిరాహార దీక్షకైనా దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

గత పది సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా పనిచేస్తూ పలుమార్లు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. 261 సర్వేనెంబర్ భూ భాధితులు వెంటనే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. తక్షణమే మండల పరిధిలోని ప్రభుత్వ భూము ల వివరాలను తీసుకొని పటాన్చెరువు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తీసుకురావలసిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశిం చారు. తదనంతరం మండలంలోని ప్రధాన సమస్య గుమ్మడిదల నుండి కానుకుంటకు గల ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పను లు త్వరలో విస్తరణ పనులు కూడా చేపడతామన్నారు.

సుమారు రెండు సంవత్సరాల నుండి ప్రయాణీకులు అనేక ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురైనప్పటికీ ఎలాం టి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామన్నారు. ఇలావుండగా నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరువు నుండి గుమ్మడిదల మండల కేంద్రానికి రవాణా సౌకర్యం కల్పించడంలో ఎమ్మెల్యే జిఎంఆర్ విఫలం అయ్యారని ప్రయాణికులు వాపోతున్నారు.

వెంటనే సంబంధిత డిపో యజమాన్యంతో మాట్లాడి రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మండల ప్రజలు కోరుతున్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సిహెచ్ కుమార్ గౌడ్, కౌన్సిలర్స్ మేడిపల్లి మురళి, సంజీవరెడ్డి, కిషన్, నాయకులు రుక్మారెడ్డి, సద్ది విజయ భాస్కర్ రెడ్డి, తుపాకుల రాజు, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, దర్గా బిక్షపతి, నరహరి, బాలకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.