8 May, 2026 | 1:23 AM

కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్

08-05-2026 12:22 AM

గుమ్మడిదల, మే 7: గుమ్మడిదల మున్సిపాలిటీ, మండల పరిధిలోని వివిధ వార్డులు, గ్రామాల పరిధిలోని 26 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 26 లక్షల రూపాయల విలువైన చెక్కులను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ చిమ్ముల సంధ్య గోవర్ధన్ రెడ్డితో కలిసి గురువారం గుమ్మడిదల తహసిల్దార్ కార్యాలయం అవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా ఈ పథకాన్ని ప్రవేశ పట్టడం జరిగిందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పరమేశం, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.