9 May, 2026 | 1:18 PM

Breaking News

తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •  

కస్టడీ నుంచి పారిపోయిన ఎమ్మెల్యే

03-09-2025 01:14 AM

 తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్‌ను అత్యాచారం, మోసం ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు ఎమ్మెల్యేను పోలీస్ కస్టడీలో ఉంచగా.. పోలీస్ కస్టడీ నుంచి ఎమ్మెల్యే తప్పించుకుపోయాడు. సనూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన హర్మీత్‌పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా.. ఆయన సహాయకులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఎమ్మెల్యే ఆయన అనుచరులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆరోపణలను ఖండించిన హర్మీత్.. ఇది తనపై జరిగిన రాజకీయ కుట్ర అని అభివర్ణించారు.