అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం
జయంతి వేడుకల్లో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ
అచ్చంపేట: భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం ఆచరణీయమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పేర్కొన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో వివిధ చోట్ల నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... అంబేద్కర్ జీవిత విశేషాలను వివరించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన భాగస్వామ్యాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేందర్ మున్సిపల్ ఛైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, నిర్వాహకులు నేతలు పాల్గొన్నారు.






