19-02-2026 02:01:57 AM
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
భూత్పూర్, ఫిబ్రవరి 18: మండల కేంద్రంలోని 13 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఆడబిడ్డ పెళ్లిళ్లకు ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా వారిని ఆదుకుంటున్నామన్నారు. అదేవిధంగా 37 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ కాపీలను ఎమ్మెల్యే అందజేశారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దేవరకద్ర నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు.
అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో కళావతమ్మ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద తండా లో సంత్ సేవాలాల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, కౌన్సిలర్ పద్మ, ఎమ్మార్వో కిషన్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.