సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
04-04-2026 06:18 PM
సదాశివపేట,(విజయక్రాంతి): సదాశివపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (Chief Minister Relief Fund) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సదాశివపేట మండలానికి చెందిన 26 మంది, సదాశివపేట పట్టణానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.11,60,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.




