8 March, 2026 | 11:50 AM

వంతెన పనులు త్వరగా పూర్తి చేయండి

07-03-2026 12:00 AM

అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, మార్చి 6 (విజయక్రాంతి): వంతెన నిర్మాణ పనులు వర్షా కాలం ప్రారంభంలోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు ఆదేశించారు. శుక్రవారం ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇందులో భాగంగానే పులిమడుగు వాగు పై  రూ.4.50 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అదేవిధంగా ఇంద్రవెల్లిలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభంలోగా  వంతెన నిర్మాణం పనులు పూర్తి చేయకుంటే ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయన్నారు. ఈ వంతెన నిర్మాణం పనులకు ముందు వాగులో నిర్మించే తాత్కాలిక రోడ్డుపై రాకపోకలు సాగించే విధంగా హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి డిప్యూటీ ఈ.ఈ అరవింద్, ఆయా గ్రామాల సర్పంచులు, పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు.