14 August, 2026 | 2:14 PM

మాట ఇచ్చారు! బస్సు వేశారు

14-08-2026 12:53 PM

బోథ్, ఆగస్టు 14(విజయక్రాంతి): మండలంలోని కన్ను గుట్ట గ్రామంలో అఖండ జ్యోతి కార్యక్రమం గురువారం నుండి ప్రారంభమైంది. కార్యక్రమానికి ఈ నెల రోజులపాటు వేల సంఖ్యలో శబరిమాత భక్తులు రానున్నారు. అయితే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ బస్సులు వేయించాలని గ్రామస్తులు ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కు విన్నవించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సమావేశంలోని మాట్లాడుతూ బస్సు తప్పకుండా వేయిస్తానని శుక్రవారం నుండి వస్తుందని హామీ ఇచ్చారు.  మాట ఇచ్చిన ఎమ్మెల్యే బస్సును వేయించడంతో గ్రామస్తులు హర్షణ వ్యక్తపరుస్తున్నారు. మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యేని పలువురు అభినందిస్తున్నారు.