10 August, 2026 | 4:05 PM

HWOను పరామర్శించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి

10-08-2026 02:53 PM

తలమడుగు, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జటంగుల నర్సింహులు మాతృమూర్తి రుకుంబాయి మృతి చెందిన విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరి వెంట మాజీ సర్పంచ్ అబ్దుల్లా, నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, మండల కన్వీనర్ వెంకటేష్, బోథ్ మాజీ ఎంపీపీలు తుల శ్రీనివాస్, రాథోడ్ సజన్ తిరుమల గౌడ్, కృష్ణ రెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, రాంకిషన్, ఉప సర్పంచ్ సోను, ప్రతాప్ తదితరులు ఉన్నారు.