10 August, 2026 | 4:04 PM

సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో మిస్ట్ విద్యార్థుల ప్రతిభ

10-08-2026 03:15 PM

సత్తుపల్లి ఆగస్ట్10. (విజయక్రాంతి): 2026 విద్యా సంవత్సరంలో గత జూన్ నెలలో మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(Mother Teresa Institute of Science and Technology) అటానమస్ హోదాలో నిర్వహించిన, బీటెక్ ద్వితీయ సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలను సాధించారని, ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చలసాని. హరికృష్ణ  తెలిపినారు. బ్రాంచులు వారీగా విద్యార్థులు సాధించిన సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (ఎస్. జి. పి .ఏ) ను ప్రిన్సిపల్ వివరించారు. ఈ అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ మదర్ తెరిసా విద్యాసంస్థల ప్రెసిడెంట్ చలసాని. సాంబశివరావు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి. ఉదయ్ కిరణ్ భార్గవ్, ఐ క్యు ఎ సి కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. వి .రామచంద్రరావు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ యల్. సాయి ఇంద్రసేనారెడ్డి, వివిధ విభాగాలు అధిపతులు, అధ్యాపకులు,బోధనేతర సిబ్బంది అభినందించారు.