10 August, 2026 | 4:04 PM

ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి

10-08-2026 02:52 PM

సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): కేంద్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలని  సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పిలుపునిచ్చారు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో సోమవారం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ ప్రజా చైతన్య యాత్ర సుల్తానాబాద్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...  దేశవ్యాప్తంగా బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న  విద్యార్థి, యువజన, మహిళ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి భారత కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న దేశవ్యాప్త నిరసన ఉద్యమంలో భాగంగా ప్రజా చైతన్య యాత్ర ను ప్రారంభించడం జరిగిందన్నారు, దేశంలో మతోన్మాద బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని, విద్యార్థులకు చదువుకునే హక్కు లేకుండా పేపర్ లీకేజీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ విద్యార్థుల భవిష్యత్తు తో చెలగాటం ఆడుతుందని వారు మండిపడ్డారు, ఈ కార్యక్రమం లో రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.