11-02-2026 01:35:48 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి10( విజ యక్రాంతి): జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడా పోటీ ల్లో మండలంలోని బాబాపూర్లోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశా ల విద్యార్థినులు కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు.
సిర్పూర్ (యూ) మండలంలో నిర్వహించిన సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొ న్న వైష్ణవి జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యింది. పోటీ ల్లో రాణించిన విద్యార్థినులు, పీఈటీ ఫౌజియాను పాఠశాల ప్రిన్సిపాల్ సుకన్య అభినం దించారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థినులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్నట్లు ప్రిన్సి పాల్ తెలిపారు.