13 March, 2026 | 12:02 AM

చిన్నా రుల అదృశ్యం మానవీయ సంక్షోభం

11-03-2026 12:00 AM

భారతదేశంలో చిన్నారుల అదృశ్యం కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. క్రమంగా సామాజిక ఇదొక పెద్ద సమస్యగా మారుతున్నది. తాజాగా జాతీయ నేర గణాంక బ్యూరో (ఎన్‌సీఆర్బీ) విడుదల చేసిన గణాంకాలు ఆం దోళనకరంగా ఉన్నాయి. ఆ గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతున్నారు. యేటా సగటున 65 70 వేల మంది బాలల మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. వీరిలో 40 శాతం మం ది ఆచూకీ ఇప్పటికీ లభించడం లేదు.

అంటే.. రోజుకు సగటున 75 100 మంది పిల్లలు తమ కుటుంబాల నుంచి దూరమవుతున్నారు. మిస్సింగ్ కేసు ల్లో 70 శాతం బాలికలే కావడం గమనార్హం. బీహార్‌లో గడిచిన ఐదేళ్లలో మిస్సింగ్ కేసులు 252 శాతం, పంజాబ్‌లో 142 శాతం పెరిగాయంటే, ఆ రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ బాలల మిస్సిం గ్ కేసుల నెట్‌వర్క్ వ్యవస్థీకృతంగా పనిచేస్తున్నాయని ఎన్నో ఎన్జీవోలు సుప్రీంకోర్టు ఇటీవల ఈ అంశంపై వ్యక్తం చేసిన ఆందోళన ఎంతో కీలకం. ప్రతి 8 నిమిషాలకో చిన్నారి తప్పిపోతున్నారు అని వార్తాపత్రికల శీర్షికలను ఉటంకిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్ బెంచ్ కేంద్రాన్ని తప్పిపట్టింది. 

బాలలు మిస్ అయిన మొదటి 2,448 గంటలు (గోల్డెన్ అవర్స్) కీలకమైనప్పటికీ, యంత్రాంగం సరిగా స్పందించడం లేదనే విమర్శలున్నాయి. ఏదై నా రాజకీయపరమైన, పరపతి గలిగిన వ్యక్తులు జోక్యం చేసుకుంటే తప్ప, కొన్ని కేసులకైనా యం త్రాంగం స్పందిస్తున్నట్లు తేలింది. 2019 గణాంకాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు సగటున ఏడుగురు, తెలంగాణలో 9 మంది బాలలు అదృశ్యమవుతున్నారు. బాలల మిస్సింగ్ కేసుల్లో తెలంగాణ 7వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది.

మిస్సింగ్ కేసులన్నిం టికీ సత్వర పరిష్కారం లభించాలంటే.. ప్రతి జిల్లాలో ప్రత్యేక ‘మిస్సింగ్ చిల్డ్రన్ యూనిట్’ ఏర్పాటు చేయాలి. దీనికి స్వతంత్ర సిబ్బంది, వాహనాలు, ఫోరెన్సిక్ సపోర్ట్ ఉండాలి. మొదటి 24 గంటల్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు తప్పనిసరి చేయాలి. ఆలస్యం చేసిన అధికారులపై క్రిమినల్ చర్య తీసుకోవాలి. ‘ఖోయా-పాయా’, ‘ట్రాక్ ఛైల్డ్’, ‘మిషన్ వాత్సల్య’ పోర్టల్‌ను ఒకే జాతీయ డేటాబేస్‌లో విలీనం చేసి రియల్ టైం షేరింగ్ చేయాలి.

ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ వంటి కార్యక్రమాలను ఏడాది పొడవునా నిరంతరం నడపాలి. బాలల ట్రాఫికింగ్ కేసులకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. కనీసం 6 నెలల్లో తీర్పు వచ్చేలా చేయాలి. బాలల హక్కుల ఉల్లంఘనలకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి. పోక్సో, జేజే యాక్ట్‌లో మరింత కఠినమైన సవరణలు చేయాలి. ప్రభుత్వం మిస్సింగ్ కేసులను అరికట్టడానికి ‘ము స్కాన్’ వంటి ప్రత్యేక ఆపరేషన్లను నిర్వహిస్తోంది.

అదృశ్యమైన వారిని గుర్తించేందుకు ‘టాక్ చైల్డ్’ పోర్టల్ ద్వారా సాంకేతిక సహాయాన్ని తీసుకుంటున్నది. స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం సమన్వయంతో పనిచేస్తేనే బాలల అక్రమ రవాణాకు అడ్డుకుట్ట పడుతుంది. చిన్నారుల అదృశ్యమనేది కేవలం పోలీసుశాఖ సమస్య మాత్రమే కాదు.. సామూహిక వైఫల్యం.

ఒక బాలుడు లేదా బాలిక ఇల్లు దాటి బయటకు వెళ్తే, వారు సురక్షితంగా ఉండాలనే నమ్మకం లేనప్పుడు ఆ దేశం ఎలా అభివృద్ధి చెందగలదు? సుప్రీంకోర్టు హెచ్చరికలు, ఎన్జీవోల ఆందోళనలు, బాధిత తల్లుల కన్నీళ్లకు ఎవరు బదులివ్వాలి? బాలలను కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడికీ ఉండాలి. 

      ముద్దం నరసింహస్వామి, వ్యాసకర్త సెల్: 99498 39699