24 May, 2026 | 11:56 AM

నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు

24-05-2026 11:16 AM

హైదరాబాద్: రాయదుర్గంలోని నిలోఫర్ కేఫ్ పరిధిలో ఆకతాయిలు రెచ్చిపోయారు. హైదరాబాద్ – టీ హబ్ పరిధిలో అర్థరాత్రి యువకుల రైసింగ్ కలకలం సృష్టించారు. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రివేళల్లో బైకులు, కార్లతో ర్యాష్ డ్రైవింగ్  చేస్తూ రోడ్లపై బీభత్సం చేశారు. వీకెండ్స్ లో పోలీసుల కళ్లుగప్పి రేసింగ్ లు నిర్వహిస్తున్న యువకులు అర్థరాత్రి హోండా సిటీ కారు రైసింగ్ చేస్తుండంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి ఓ యువకుడు కారుతో దూసుకెళ్లారు. అడ్డుకునే యత్నంలో కానిస్టేబుల్ రమేశ్ కు గాయాలుకావడంతో సహనం నశించిన పోలీసులు కారు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడిన పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు. టి-హబ్ పరిసరాల్లో రేసింగ్ లు చేయొద్దని పోలీసులు హెచ్చరించారు.