27 July, 2026 | 12:39 AM

మీరాబాయి గోల్డెన్ హ్యాట్రిక్

27-07-2026 12:09 AM

48 కేజీల విభాగంలో స్వర్ణం

చరిత్ర సృష్టించిన భారత వెయిట్‌లిఫ్టర్

భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం

రజతం గెలిచిన రిషికాంత సింగ్

భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను చరిత్ర సృష్టించింది. కామన్‌వెల్త్ గేమ్స్ చరిత్రలో వరుసగా మూడోసారి స్వర్ణం ముద్దాడి రికార్డులకెక్కింది. 48 కేజీల విభాగంలో సరికొత్త రికార్డుతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుని సత్తా చాటింది. అటు పురుషుల వెయిట్ లిఫ్టింగ్‌లో రిషికాంత సింగ్ రజతం సాధించాడు.

గ్లాస్గో, జూలై 26 : కామన్‌వెల్త్ గేమ్స్ లో భారత్ కు తొలి స్వర్ణం దక్కింది. వెయిట్ లిఫ్ట ర్ మీరాబాయి చాను చారిత్రక ప్రదర్శనతో బంగారు పతకాన్ని అందించింది. కామన్‌వెల్త్ గేమ్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డుతో ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకుంది. మీరాబాయి స్నాచ్ తొలి ప్రయత్నంలో ఆమె విఫలమైంది.

అయితే రెండో ప్రయత్నంలో 82 కేజీలు, మూడో ప్రయత్నంలో 85 కేజీలు ఎత్తి సరికొత్త రికార్డు సృష్టించింది. తర్వాత క్లీన్ అండ్ జర్క్ మొదటి ప్రయత్నంలో మీరాబాయి విఫలమైంది. తర్వాత రెండో ప్రయత్నంలో 105 కేజీలు ఎత్తి సరికొత్త రికార్డు నెలకొల్పింది. మొత్తంగా చాను 190 కేజీలు ఎత్తి కామన్‌వెల్త్ గేమ్స్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది.

కాగా ఈ విజయంతో సుశీల్ కుమార్, వినేష్ ఫోగట్  తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడు బంగారు పతకాలు సాధించిన మూడో భారతీయ అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. 2018  గోల్ కోస్ట్ , 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లోనూ చాను స్వర్ణాలు గెలిచింది. ఇదే విభాగంలో నైజీరియా రూత్ అసుక్వో న్యోంగ్ (168 కేజీలు) రజతం, మలేసియాకు చెందిన ఐరీన్ జేన్ హెన్రీ (167 కేజీలు) కాం స్య పతకాలు గెలిచారు.  పతకం అందుకున్నప్పుడు మీరాబాయి చాను భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. పోడియం దగ్గర జాతీయ గీతం వినిపిస్తున్నంత సేపూ కన్నీటి పర్యంతమైంది.

కామన్‌వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడోసారి దేశం తరపున పసిడి పతకం గెలవడం చాలా సంతోషంగా ఉం దని మీరాబాయి చాను తెలిపింది.స్నాచ్ మరియు క్లీన్ అండ్ జెర్క్ లలో తన మొదటి ప్రయత్నాల్లో విఫలమైనప్పటికీ ఒత్తిడిని అధిగమించి తర్వాత రికార్డు బరువులను ఎత్తగ లిగానని చెప్పింది. రెండు నెలల్లో జరగనున్న ఆసియాక్రీడల్లో రాణించడమే తన ప్రధాన లక్ష్యమని, అందువల్లే కామన్‌వెల్త్ గేమ్స్‌లో అనవసరమైన రిస్క్ తీసుకోకుండా 3వ ప్రయత్నాన్ని వదిలేశానని వివరించింది. 

రిషికాంత సింగ్‌కు రజతం

మరోవైపు పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 60 కేజీల విభాగంలో మణిపూర్ వెయిట్ లిఫ్టర్ రిషికాంత సింగ్ రజత పతకం సాధించాడు. మొత్తం 264 కేజీలు ఎత్తి ఈ కామ న్వెల్త్ పోటీల్లో భారత్కు తొలి రజత పతకాన్ని అందించాడు. మలేసియాకు చెందిన అనిక్ బిన్ కాస్డాన్ స్వర్ణం, కెన్యాకు చెందిన జోషు వా అముంగా కాంస్య పతకాలు నెగ్గారు. స్నాచ్ విభాగంలో 121 కేజీలు ఎత్తిన రిషికాంత,క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో చివరి ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తే క్రమంలో విఫలమయ్యాడు.

ఈ విభాగంలో మూడు ప్రయత్నాల్లో భాగంగా తొలుత 143 కేజీలు ఎత్తగా, తర్వాతి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. దీంతో రిషికాంత 264 కేజీల ఎత్తి రెండో స్థానానికి పరిమితమయ్యాడు. స్వర్ణం నెగ్గిన మలేషియా ఆటగాడు అనిక్ బిన్ తొలుత స్నాచ్ విభాగంలో మూడు ప్రయత్నాల్లో భాగంగా గరిష్ఠంగా 121 కేజీలే ఎత్తాడు. రిషికాంత సైతం 121 కేజీలు ఎత్తడంతో భారత్ స్వర్ణంపై ఆశలు పెట్టుకుంది. అయితే దురదృష్టవశాత్తు క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో చివరి ప్రయత్నంలో రిషికాంత విఫలం కావడంతో భారత్ ఆశలు చెదిరిపోయాయి. చివరి ప్రయత్నంలో మలేసియా ఆటగాడు 152 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించాడు. బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ పోటీల్లో 55 కేజీల విభాగంలో బరిలోకి దిగిన రిషికాంత అప్పుడు పతకం గెలవకుండానే వెనుదిరిగాడు.