28 March, 2026 | 2:06 PM

Breaking News

పత్తి గోదాంలో అగ్ని ప్రమాదం   •   ప్రభుత్వ స్థల వివాదం – గుడి నిర్మాణానికి అడ్డంకులు, అధికారులకు వినతి   •   తుంగతుర్తి లోక్‌అదాలత్‌లో ఒకటైన జంట   •   ఇంటింటికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ   •   సింగరేణి ఉత్పత్తి లక్ష్యంలో సత్తుపల్లి అగ్రగామి   •   ఏం అచ్చెమ్మ అత్త బాగున్నావా..! ఆప్యాయంగా పలకరించిన మంత్రి తుమ్మల   •   నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు: మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్   •   మూసీ నది పునరుజ్జీవనంపై సర్కార్ కీలక నిర్ణయం   •   ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ ప్రక్షాళన.. ఎవరైనా అడ్డుపడితే శివతాండవమే..!   •   చిత్తూరులో రోడ్డు ప్రమాదం... వరంగల్‌కు చెందిన కుటుంబం మృతి   •  

గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి

11-10-2025 04:19 PM

కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ముఖ్య అతిథులుగా మంత్రులు..

కాకతీయ యూనివర్సిటీ (విజయక్రాంతి): ఈ రోజు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఫార్మసీ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలను ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్, స్టార్టప్‌లకు హబ్‌లుగా అభివృద్ధి చేయడానికి ప్రోత్సహించనున్నట్టు తెలిపారు. పూర్వ విద్యార్థుల మద్దతుతో కాకతీయ విశ్వవిద్యాలయం పునః కీర్తి సాధిస్తుందని మంత్రి తెలిపారు. ఆరంభ దశలో కళాశాల అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ, నిబద్ధత కలిగిన అధ్యాపక బృందంతో భారత్‌లో టాప్ 10 ఫార్మసీ కళాశాలల్లో ఒకటిగా నిలిచిందన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర ఎంతో గొప్పదని ప్రశంసించారు. వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, రుసా వంటి సంస్థల మద్దతుతో విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల మరింత అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఇప్పటివరకు ఈ విశ్వవిద్యాలయం నుండి 600 మందికి పైగా పీహెచ్.డీలు పూర్తిచేసినట్లు చెప్పారు.

వారిలో చాలామంది పరిశోధకులు, ఉపాధ్యాయులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నత స్థాయిలలో పనిచేస్తున్నారని వివరించారు. డిసెంబర్‌లో రాష్ట్ర స్థాయి హ్యాకథాన్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే, విశ్వవిద్యాలయం మద్దతుతో అవగాహన ఒప్పందం KHub and THub  అమలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో పని చేసిన పూర్వ ఉపాధ్యాయులను సత్కరించారు. విద్యా, ప్రయోగశాలల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల మద్దతు ప్రశంసనీయం అని అన్నారు. సెప్టెంబర్ నెలలో విశ్వవిద్యాలయంలో, అలాగే సెప్టెంబర్ చివరిలో USAలో పూర్వ విద్యార్థుల సమావేశాలు ప్రొఫెసర్ రెడ్డి వెల్లడించారు. అంతేకాక, డిసెంబర్‌లో విశ్వవిద్యాలయంలో మెగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగనుందని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల వారసత్వాన్ని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసించారు, యూనివర్సిటీ తన పేరు, కీర్తిని తిరిగి తీసుకురావాలని, యూనివర్సిటీ  old teacher's  దార్శనికతను ఆయన ప్రశంసించారు. పూర్వ విద్యార్థుల సావనీర్, రెండు పుస్తకాలను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జె. కృష్ణవేణి సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.