22 April, 2026 | 1:50 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

22-04-2026 12:21 PM

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని రాష్ట్ర పౌరసరఫరాల,నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లక్ష్మీ నరసింహ గార్డెన్ ఫంక్షన్ హాల్ వ్యవస్థాపకులు, గంజి చంద్రమౌళి మృతి పట్ల మంత్రి ఉత్తమ్ సంతాపం వ్యక్తం చేశారు. గంజి చంద్రమౌళి నా చిరకాల మిత్రుడు, ఆప్తుడు, శ్రేయోభిలాషి అని అతని మృతి చాలా బాధాకరమని తెలిపారు.వారి కుటుంబానికి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ,తన సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. లక్ష్మీ నరసింహ గార్డెన్ ఫంక్షన్ హాల్ ను స్థాపించిన చంద్రమౌళి ఈ ప్రాంత ప్రజల మనసును చురుగొని, అనతి కాలములోనే  ప్రజల మన్ననలు పొందారని,కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేయడం కోసం నిస్వార్ధంగా పనిచేసిన వ్యక్తి అని మంత్రి  కొనియాడారు.