టీజీ ఆయిల్‌ఫెడ్‌పై మంత్రి తుమ్మల సమీక్ష
24-07-2026 04:45 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత అండ్ జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) శుక్రవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని పరిశ్రమ భవన్లో టీజీ ఆయిల్‌ఫెడ్ కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, సంస్థ పనితీరు, ప్రాసెసింగ్ సామర్థ్యం, రైతులకు సకాలంలో చెల్లింపులు, ఆయిల్‌ఫెడ్ అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై మంత్రి తుమ్మల అధికారులకు దిశానిర్దేశం చేశారు.






