పత్తి కొనుగోళ్ల సన్నాహక ఏర్పాట్లపై మంత్రి తుమ్మల సమీక్ష
హైదరాబాద్: హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ గోల్కొండ హోటల్‌లో మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Cotton Corporation of India) సీఎండీతో పత్తి ఎంఎస్పీ కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రంలో చేపడుతున్న సన్నాహక ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.... పత్తి కొనుగోళ్ల సన్నాహక ఏర్పాట్లపై రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశానికి సీసీఐ సీఎండీ, వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ & ప్రభుత్వ కార్యదర్శి (APC & Secretary to Government), మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌తో పాటు వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.






