విద్యార్థులను ప్రశంసించిన మంత్రి శ్రీధర్ బాబు
02-05-2026 12:29 AM
మంథని, మే1 (విజయక్రాంతి): పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో సత్తాచాటిన బేగంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను శుక్రవారం ఐటీ పారిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభినందించారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల స్థాయిలో 554 మార్కులతో రామగిరి మండలంలో ప్రతిభ చాటిన బేగంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థి శ్రీమంతుల పూర్ణచందర్ తో పాటు పాఠశాల టాపర్లుగా నిలిచిన ఇల్లందుల రాంచరణ్ 536 కొట్టే లాస్యల 531లను మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. ఈ సందర్భంగా బేగంపేట ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని మంత్రి ప్రశంసించారు.






