18 June, 2026 | 8:34 PM

అనారోగ్యంతో బాధపడుతున్న జంజర్ల సునందకు అండగా నిలిచిన మంత్రి శ్రీధర్ బాబు

18-06-2026 04:55 PM

రూ. 2,50,000/- ఎల్‌ఓసీ మంజూరు

మంథని, జూన్ 18(విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతున్న మంథని నియోజకవర్గం రామగిరి మండలం, నాగేపల్లి గ్రామానికి చెందిన జంజర్ల సునందకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అండగా నిలిచారు.

సునంద తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు  దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 2,50,000 ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. ఈ ఎల్‌ఓసీ పత్రాలను మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన సహాయకులు బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. తమ కష్టకాలంలో ఆదుకుని, వైద్య ఖర్చుల నిమిత్తం సాయం అందించిన మంత్రి శ్రీధర్ బాబుకి బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.