18 June, 2026 | 9:59 PM

ఇంటర్మీడియట్ కామర్స్, అకౌంటెన్సీ తెలుగు అకాడమీ పుస్తకాల సహ-రచయితగా డాక్టర్ ఎం మల్లారెడ్డి

18-06-2026 04:56 PM

ముకరంపుర, జూన్ 18(విజయ క్రాంతి): ప్రస్తుత విద్యా సంవత్సరం 2026-27 సంవత్సరానికి  ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కామర్స్ మరియు అకౌంటెన్సీ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం పుస్తకాల సహ రచయితగా కరీంనగర్ లోని  స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల కామర్స్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. మల్లారెడ్డి ఉన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఏసీఈ కోర్సు కు సంబంధించిన అకౌంటెన్సీ మరియు కామర్స్ పాఠ్యపుస్తకాల సహ రచయితగా తన సేవలను అందించారు.

అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్ సవరణ కోసం ఏర్పాటు చేసిన కామర్స్, అకౌంటెన్సీ విషయ నిపుణుల కమిటీలో సైతం డాక్టర్ ఎం మల్లారెడ్డి  ఉండడం విశేషం.ఈ సందర్భంగా మల్లారెడ్డి  మాట్లాడుతూ  గతంలో రూపొందించిన  పాఠ్య  పుస్తకాలకు భిన్నంగా  విద్యార్థులలో పఠనాసక్తిని, విషయం పరిజ్ఞానాన్ని పెంపొందించే ఆసక్తికర అంశాలు, ప్రఖ్యాత వ్యక్తుల విజయ గాథలు, మీకు తెలుసా? మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి, కేస్ స్టడీస్, విద్యార్థి కార్యచరణ, పాఠ్యాంశాల వీడియోలను నిక్షిప్తం చేసిన క్యూఆర్ కోడ్లు మొదలైన అనేక అంశాలను చేర్చి పుస్తకాన్ని రూపొందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.  ఈ సందర్భంగా డాక్టర్ ఎం మల్లారెడ్డిని కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కల్వకుంట రామకృష్ణ వైస్ ప్రిన్సిపల్ పీ నితిన్,  మరియు అధ్యాపక బృందం అభినందించారు.